చార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కాంటా.. .విద్యుత్ షాక్‌తో పది నెలల పసిపాప మృతి,
రాజరాంపల్లెలో విషాదం…. కళ్లముందే బిడ్డను కోల్పోయిన తల్లి కన్నీరుమున్నీరు.
జగిత్యాల జిల్లా: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్.6
జగిత్యాల జిల్లాలోని రాజరాంపల్లెలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. చార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కాంటాను తాకడంతో విద్యుత్ షాక్‌కు గురైన పది నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయింది. అప్పటివరకు ఇంట్లో పాకుతూ ఆడుకుంటున్న చిన్నారి విగతజీవిగా మారడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
స్థానికంగా అందిన సమాచారం ప్రకారం… తల్లిదండ్రులు ఎలక్ట్రిక్ కాంటాను చార్జింగ్‌కు పెట్టి తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో పది నెలల పాప పాకుతూ వెళ్లి చార్జింగ్‌లో ఉన్న కాంటాను పట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురైన చిన్నారి తీవ్రంగా విలవిల్లాడి ప్రాణాలు విడిచింది.
కళ్లముందే ఆడుకుంటున్న బిడ్డ ఒక్కసారిగా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ముఖ్యంగా తల్లి బిడ్డను కోల్పోయిన బాధతో కన్నీరుమున్నీరుగా విలపించడం అక్కడివారిని కలచివేసింది. ఈ ఘటనతో రాజరాంపల్లెలో తీవ్ర విషాదం నెలకొంది.
తల్లిదండ్రులకు ఈ విషయం హెచ్చరికగా ,
చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో విద్యుత్ పరికరాల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి. చార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను పిల్లలకు అందకుండా ఉంచడంతో పాటు, విద్యుత్ కనెక్షన్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ విషాద ఘటన గుర్తుచేస్తోంది.